విషాదం.. టీచర్ తిట్టిందని ఉరేసుకుని చనిపోయిన స్టూడెంట్

పిల్లలను సున్నితంగా డీల్ చేయాలి. తెలిసీ తెలియని వయసులో వాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారనే స్కూళ్లలో ఉపాధ్యాయులు కూడా వారితో కఠినంగా ఉండొద్దని రూల్స్ పెట్టారు. టీచర్ కొట్టాడనో.. తిట్టాడనో పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్న ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లపైనే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ సంఘటనపై చర్చ జరుగుతోంది.

ఢిల్లీలోని ఇందర్పురి ఏరియాలోని ఓ స్కూల్ లో చదువుకుంటున్న ఏడో తరగతి విద్యార్థిని స్కూలు టీచర్ తిట్టడంతో మనస్తాపం చెందింది. ఐతే తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేదు. సోమవారం ఉదయాన్నే స్కూలుకు వెళ్లేందుకు ఆమెను తల్లి రెడీ చేసింది. ఐతే.. స్కూలు వెళ్లేందుకు ఇష్టంలేని పద్నాలుగేళ్ల ఆ చిన్నారి… తన రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ ను ఆ చిన్నారి తన చేతిపైనే రాసుకుంది. స్కూల్లో టీచర్ బాగా తిట్టడం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ లో చెప్పింది. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నామని వెస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates