హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కొడుకు అరెస్ట్

  • బీటెక్ చదువుతున్న చాణక్య.. కశ్మీర్ నుంచి కొరియర్‌లో డ్రగ్స్

అంబర్ పేట, వెలుగు: అంబర్ పేటలో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి  డ్రగ్స్‌ను కొరియర్‌లో తెప్పించుకుని అమ్ముతున్న కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్యను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్ పేటలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్‌లో ఉండే కాంగ్రెస్ నాయకుడు కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్య(22) బీటెక్ చదువుతున్నాడు. కొంత కాలం నుంచి చాణక్య వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ కొంటున్నాడు. డ్రగ్స్‌ను తన ఫ్రెండ్స్‌తో పాటు తెలిసిన వారికి చాణక్య అమ్మేవాడు.

జమ్మూకశ్మీర్ నుంచి ఎల్ఎస్‌డీ డ్రగ్‌ను చాణక్య కొరియర్‌లో ఆర్డర్ చేశాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆర్డర్ చాణక్య అడ్రెస్ డెలివరీ కాగానే అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.లక్షా 40 వేలు విలువ చేసే 824 మిల్లీగ్రాముల ఎల్ఎస్‌డీ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అంబర్ పేట పోలీసులకు వాటిని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు చాణక్యను రిమాండ్‌కి తరలించామని పోలీసులు తెలిపారు.

Latest Updates