వద్దు నాన్నా.. పోనియ్‌ బిడ్డా

A cute son stop his police officer father to go on duty

ఆయనో పోలీసు. ఆదరబాదరాగా డ్యూటీకి రెడీ అవుతున్నడు. డ్రస్‌‌‌‌ వేసుకున్నడు. ఇకపోయేదే ఆలస్యం . ఇంతలో చిన్నారి కొడుకొచ్చాడు. ఎప్పుడోగానీ కనబడని నాన్నను చూసిగట్టిగా పట్టుకున్నాడు. ‘నన్ను వదిలి వెళ్లొద్దునాన్నా’ అంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు.‘ఇంట్లోనే ఆడుకుందాం ’ అని బయటికెళ్లకుండా కాళ్లు పట్టుకున్నాడు. ‘ఇప్పుడే వస్త బిడ్డ.అందాక ఆడుకో. పోనియ్‌ బిడ్డా’ అని తండ్రి బతిమాలినా వినలేదు. ఏడుస్తున్న కొడుకును సముదాయించలేక, ఆఫీసుకెళ్లలేక ఆ పోలీసుతండ్రి పడ్డ వేదన వర్ణనాతీతం. 80 సెకన్లున్నఈ వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో వైరలైంది.చాలా మంది గుండెను బరువెక్కించింది. పోలీసుల కష్టాలను కూడా చెప్పకనే చెప్పింది.

Latest Updates