సీఏఏపై తీర్మానం..కేసీఆర్ కు ఓవైసీ ధన్యవాదాలు

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా నియంత్రణకు తాము పూర్తి సహకారం అందిస్తామన్నారు  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇవాళ యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కోవిడ్19 నియంత్రణ చర్యలకు తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. కరోనా విస్తరించకుండా వ్యక్తిగత దూరం పాటించేలా అవగాహన కల్పించేందుకు ముస్లీం యాక్షన్ కమిటీ  ప్రయత్నం చేస్తుందని ట్వీట్ చేశారు.

అలాగే  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం  కేసీఆర్‌ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు  హోం మినిస్టర్  మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు, పలువురు మైనారిటీ నాయకులు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Latest Updates