ఎల్.ఆర్.ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా

కుషాయిగూడ: ఎల్.ఆర్.ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కాప్రా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వ‌హించారు టీడీపీ నాయ‌కులు. టీడీపీ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ ధ‌ర్నాలో ఎల్.ఆర్.ఎస్ ను వెంటనే రద్దు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎల్.ఆర్.ఎస్ పేరుతో ప్రజల వద్ద దోచుకుతింటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు.

దొంగలు రాత్రి దోచుకుంటే సీఎం కేసీఆర్ పట్టపగలు పేద ప్రజలను దోచుకుంటున్నాడని టీడీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో డబ్బులు దండుకుంటూ పుట్టిన పిల్లలపై కూడా అప్పులు చేసిన ఘనత కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు.ఎల్.ఆర్.ఎస్ ను రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

 

Latest Updates