ఫ్లిప్​కార్ట్​ ఫౌండర్​ భన్సల్​పై కట్నం కేసు

బెంగళూరు: ఆన్‌లైన్ షాపింగ్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కో–ఫౌండర్‌‌ సచిన్ భన్సల్‌‌పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కట్నం కోసం వేధిస్తున్నారని గత నెల 28న బెంగళూరు కోరమంగళ పోలీసు స్టేషన్‌లో భార్య ప్రియా భన్సల్‌ కంప్లెయింట్‌ ఇచ్చారు. పెళ్లి సమయంలోనే రూ.50 లక్షలను కట్నం కింద తన తండ్రి ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ, జాయింట్‌గా ఇచ్చిన ప్రాపర్టీని తన పేరు మీద మార్చాలని సచిన్ భన్సల్‌ వేధిస్తున్నాడని పేర్కొంది.  ఇందుకు ఒప్పుకోకపోవడంతో, 2019 నుంచి తనను వేధిస్తున్నాడని పేర్కొన్నారు.  ఢిల్లీలో ఉంటున్న తన చెల్లిని కూడా సచిన్ భన్సల్‌ లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి తప్పుకున్న సచిన్ భన్సల్‌ ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నావీ టెక్నాలజీస్‌కు సీఈవో.

Latest Updates