పిల్లలను దయ్యాలతో పోల్చిన ప్రముఖ హీరోయిన్

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, వివాదాస్పాద వాఖ్యలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్వరా భాస్కర్ ఓ నాలుగేళ్ల బాలుడిపై కోపంతో ఇష్టంవచ్చినట్లుగా తిట్టిపోసింది. అదేంటి ఓ హీరోయిన్.. ఒక బాలుడిని తిట్టడమేంటి అనుకుంటున్నారా? అవునండీ అదే నిజం.. అసలు విషయమేంటంటే..

స్వరా భాస్కర్ తన కెరీర్ ప్రారంభంలో యాడ్‌లలో నటించింది. అయితే ఆ సమయంలో ఆమె ఒక నాలుగేళ్ల బాలుడితో ఒక యాడ్ చేయవలసి వచ్చిందట. ఆ యాడ్ తీస్తున్న సమయంలో ఆ బాలుడు ఆమెను ‘ఆంటీ’ అని సంభోదించాడట. అంతే ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన ఆమె.. ఆ బాలుడిని ఇష్టమొచ్చినట్లుగా తిట్టిందట. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభమవుతుంటే, ఈ బాలుడు ఆంటీ అని పిలుస్తున్నాడేంటి అని ఆమెకు కోపమొచ్చిందట. అంతేకాకుండా పిల్లలను దయ్యాలతో పోలుస్తూ ఏదేదో వాగేసిందట. ఇదంతా ఎవరో చెప్పింది కాదు. అభిష్ మాథ్యూ అనే బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘సన్ ఆఫ్ అభీష్’ అనే ప్రోగ్రామ్‌లో స్వరా భాస్కర్ స్వయంగా వెల్లడించింది. స్వరా భాస్కర్ పిల్లలను దయ్యాలతో పోల్చడంపై నెటిజన్లు సీరియస్ అవుతూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Latest Updates