రైతు ప్రాణం తీసిన యూరియా కొరత

యూరియా కొరత ఓ అన్నదాత ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం లైన్లో నిలబడిన ఎల్లయ్య అనే రైతు ప్రాణాలు విడిచాడు. యూరియా కోసం మూడు రోజులుగా దుబ్బాక వస్తున్న యూరియా దొరక లేదు. దీంతో గురువారం కూడా పొద్దున్నే వచ్చి లైన్ లో నిలబడిన ఎల్లయ్య.. కాసేపటికే సొమ్మ సిల్లిపడిపోయాడు. స్థానిక రైతులు హాస్పిటల్ కు తరలించే లోపే మృతి చెందాడు. రైతు ఎల్లయ్య సొంతూరు అచ్చుమాయపల్లిగా గుర్తించారు.

Latest Updates