పిల్లలను లోయలో విసిరేసిన తండ్రి

చెన్నై: కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు చిన్నారులను 150 అడుగుల లోయలోకి విసిరేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా సెందూరుచక్కపారైకు చెందిన చిరంజీవి తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం రాత్రి కూడా భార్యతో గొడవపడ్డాడు. దాంతో కోపోద్రిక్తుడైన చిరంజీవి బుధవారం కుమారుడు శ్రీరాజ్‌ (8), కుమార్తె కవియరసి (5)తో కలిసి గ్రామ సమీపంలోని కొండపై ఉన్న వ్యూ పాయింట్‌ దగ్గరకు వెళ్లాడు. జనసంచారం లేని సమయంలో చిరంజీవి పిల్లలిద్దరినీ 150 అడుగుల లోయలో విసిరేశాడు. పోలీసులు చిరంజీవిని అరెస్ట్ చేసి అగ్నిమాపక సిబ్బందితో కలిసి చిన్నారుల కోసం గాలిస్తున్నారు.

Latest Updates