వైరల్ వీడియో: సింహానికి దడ పుట్టించిన కుక్క

ఆన్‌‌లైన్‌లో ప్రతి రోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. సూపర్బ్‌‌గా అనిపించే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి తరహా వీడియో గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోలో సింహంతో కుక్క పోరాడిన తీరు ఆకట్టుకుంటోంది. తన కంటే వందల రెట్లు ఎక్కువ బలం కలిగిన సింహాన్ని చూసి జడుచుకోకుండా కుక్క నిలువరించిన తీరు ఆశ్చర్యపరచక మానందు. కుక్క సవాల్ విసురుతూ మృగరాజు పైకి దూసుకెళ్లడం, భయపెట్టడం నివ్వెరపరుస్తుందంటే నమ్మండి. ఈ వీడియో చూశాక కుక్కకు ఉన్న తెగింపు, నమ్మకం మన జీవితాల్లోనూ ఉండాలని కోరుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం.. 1.7 లక్షల వ్యూస్ వచ్చిన ఈ వీడియోను మీరూ చూసేయండి.

Latest Updates