స్విమ్స్ ఆస్పత్రిలో బిల్డింగ్ పెచ్చులూడి గర్భిణి మృతి

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. పద్మావతి కోవిడ్ సెంటర్ లో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధిక అనే గర్భిణీ అక్కడిక్కడే చనిపోయింది. రాధిక హాస్పిటల్ లో అటెండర్ గా పనిచేస్తోంది. ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులకు, మరో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవలే ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తవడంతో భవనంలో కోవిడ్ సెంటర్ ను అధికారులు ప్రారంభించారు. గాలి కారణంగా పెచ్చులూడి పడ్డట్లు  ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రమాద సమయంలో దాదాపు 200 మంది రోగులు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. నాశిరకం నిర్మాణం చేసిన బిల్డింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని రాధిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

సీఎం జగన్ ఆదేశాలతో మృతులకు కుటుంబాలకు రూ. 10లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.  ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

LRS పై ఆందోళన వద్దు.. వీలైతే చెల్లించకండి

ఎంత ధైర్యం.. ప్రియాంకపై చేయి వేస్తావా?

అప్పుల బాధతో ప్రాణం తీసుకున్న ప్రైవేట్ టీచర్

డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

Latest Updates