బర్త్ డే జోష్ : హాఫ్ సెంచరీతో చెలరేగిన వార్నర్

బర్త్ డే జోష్ : హాఫ్ సెంచరీతో చెలరేగిన వార్నర్

దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఇవాళ్లి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్‌ సాహా చెలరేగి ఆడుతున్నారు. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 77 రన్స్ చేసింది హైదరాబాద్. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ 25 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంగళవారం డేవిడ్ వార్నర్ బర్త్ డే 34వ బర్త్ డే కావడంతో.. ఆ జోష్ తోనే బౌండరీలు బాదుతున్నాడు. ఇవాళ్టి మ్యాచ్ ఎలాగైనా గెలిచి ఈ పుట్టినరోజును హైదరాబాద్ విజయంతో సెలబ్రేట్ చేసుకోవాలని SRH ఫ్యాన్స్ కోరుతున్నారు.

9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్లు నష్టపోకుంటా హైదరాబాద్ స్కోర్ 102. వార్నర్(62), సాహా(39) రన్స్ తో క్రీజులో ఉన్నారు. ఇదే ఊపు చివరివరకు కొనసాగితే హైదరాబాద్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.