పెట్రోల్ బంక్ లో మంటలు..కాలిపోయిన బుల్లెట్ వాహనం

గుంటూరు లాడ్జీ సెంటర్ లోని ఇండియన్ పెట్రోల్ బంక్ లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బుల్లెట్ బండికి పెట్రోల్ పోస్తుండగా ఇంజిన్ పై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ట్యాంక్ నిండి ఇంజన్ మీద పెట్రోలు పడటం వల్ల ఈ అగ్ని ప్రమాదం  జరిగింది. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బుల్లెట్ వాహనం కాలపోయింది. ఘటన స్థలానికి ఫైరింజన్ వచ్చే సరికి దగ్గరున్న వారు మంటలను అదుపులోకి తెచ్చారు. వాహనదారుడి ఫిర్యాదుతో  పోలీసులు దర్యాప్తు చేపట్టారు… ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.

see more news

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

వెయ్యి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

Latest Updates