లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి

ముంబైలోని ధారావిలో విషాదం చోటుచేసుకుంది.  లిప్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం షాహు నగర్ లోని కోజీ షెల్టర్ బిల్డింగ్ లో ఈ ఘటన జరిగింది. హోజెఫా  షేక్ నాల్గవ అంతస్తు నుంచి కిందికి వెళ్లడానికి  తన అక్కచెల్లితో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ కిందకు రాగానే తన అక్కా చెల్లి ఇద్దరు దిగారు.. కానీ హోజేఫా షేక్ బయటకు వస్తూ డోర్  గ్రిల్ కు ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ కదలడంతో చిన్నారి నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేశారు. లిఫ్ట్ లో  ఏదైనా టెక్నికల్ లోపం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గెలిచాక 15 నిముషాల్లో పాక్ కుక్కల్ని,రోహింగ్యాలను తరిమేస్తం

Latest Updates