పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే రూ.10 డిస్కౌంట్

పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత ప్రజలందరిలో దేశభక్తి కనిపిస్తోంది. అమర జవాన్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ లో ఓ ఫుడ్ స్టాల్  ఓనర్ తన దేశభక్తిని చాటుకుంటున్నాడు. తన బండిపై ఫుడ్ తినడానికి వచ్చే వారు.. పాకిస్తాన్ ముర్దాబాద్ అని గట్టిగా స్లోగన్ ఇవ్వాలని కోరుతున్నాడు యజమాని అంజల్ సింగ్. అలా చెబితే.. 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు. షాపు నిర్వాహకుడి దేశభక్తికి అంతా ఫిదా అవుతున్నారు.

“పాకిస్థాన్ మానవత్వమే లేదు.. అది మనుషులనెప్పుడూ లెక్కచేయలేదు. వాళ్లకు బుద్ధి వస్తుందన్న నమ్మకం లేదు. అందుకే పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పిస్తున్నా” అని అన్నాడు స్టాల్ ఓనర్ అంజల్ సింగ్. తమకు డిస్కౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పాకిస్థాన్ ముర్దాబాద్ అంటామని కొందరు చెప్పారు.

Latest Updates