కరోనా పేరుతో పేద ప్రజల్ని దోచుకుంటున్న ప్రభుత్వ డాక్టర్

కరోనా పేరుతో పేద ప్రజల్ని దోచుకుంటున్నాడంటూ ప్రభుత్వ డాక్టర్ ను నిలదీశారు బాధితులు. నల్లగొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ వెంకన్న… జనం కరోనా వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే కరోనా రోగుల్ని.. అక్కడి మందులు పనిచేయవంటూ తన ప్రైవేట్ క్లినిక్ కి రప్పించుకుంటున్నట్టు చెబుతున్నారు. మెడికల్ షాపుల యాజమాన్యాలతో కుమ్మక్కై.. వేల రూపాయల మందులు రాస్తూ.. డబ్బులు దండుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డాక్టర్ ని సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Latest Updates