డాక్టర్ లేడన్నందుకు హాస్పిటల్ పై దాడి

డాక్టర్ లేడని వేరే హస్పిటల్ కు రిఫర్ చేసినందుకు హాస్పిటల్ పై దాడి చేశారు పేషేంట్ బంధువులు. ఈ ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా హాస్పిటల్ లో జరిగింది. గుండె జబ్బుతో బాధపడుతున్న పేషేంట్ ను కొందరు వ్యక్తులు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో లేడని..వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లండని సూచించింది హాస్పిటల్ యాజమాన్యం.  దీంతో  ఆగ్రహంతో రగిలిపోయిన పేషేంట్ బంధువులు హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వాడును ధ్వంసం చేశారు.  ఈ ఘటన హాస్పిటల్ లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

వాళ్లు కొన్ని ఆసుపత్రులు తిరిగిన తర్వాత ఇక్కడకు వచ్చారని, హార్ట్ స్పెషలిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి నుంచి రిఫర్ చేశామని జిల్లా హాస్పిటల్ డాక్టర్ రాకేశ్ మిట్టల్ చెప్పారు.  కాని వారు పేషేంట్ ను తీసుకెళ్లడానికి నిరాకరించారన్నారు. దీంతో వారు ఎమర్జెన్సీ  వార్డును ధ్వంసం చేసి కొట్టారని చెప్పారు.