నెదర్లాండ్స్ రైల్లో ఉగ్రవాది కాల్పులు.. ఒకరి మృతి

ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవలే న్యూజీలాండ్ లో ఓ టెర్రరిస్ట్ మసీదులో కాల్పులు జరిపి 49మందిని బలిగొన్నాడు. తాజాగా సెంట్రల్ నెదర్లాండ్స్ లోని యూట్రెక్ట్ ప్రావిన్స్ ప్రధాన నగరంలో ఓ ఉగ్రవాది బీభత్సం సృష్టించాడు. ఈ ఉదయం 9.30 నిమిషాల టైమ్ లో గన్ తో రెచ్చిపోయాడు. యూట్రెక్ట్ నగరం.. అక్టోబర్ ప్లేన్ జంక్షన్ దగ్గర… ట్రామ్ రైల్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.

సైకో జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు డచ్ పోలీసులు. చాలామందికి గాయాలైనట్టు చెప్పారు. రైల్లో కాల్పులు జరిపిన ఉన్మాది.. ఆయుధంతో పరారయ్యాడు. అతడికోసం గాలింపు కొనసాగుతోంది.

ఫైరింగ్ జోన్ మొత్తాన్ని కార్డన్ చేసి సర్చ్ చేస్తున్నారు పోలీసులు. కాల్పుల కలకలంతో యుట్రెక్ట్ సెంట్రల్ స్టేషన్ కు ట్రామ్ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. స్కూళ్లు ఓపెన్ చేయొద్దని కోరారు.

ఉది ఉగ్ర చర్య అని చెప్పేందుకు ఆధారాలున్నాయని కౌంటర్ టెర్రర్ పోలీసులు చెప్పారు.  యూట్రెక్ట్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. డచ్ యాంటీ టెర్రరిజం కోఆర్డినేటర్  స్థానిక అధికారులతో సమీక్షించి ఆదేశాలు ఇస్తున్నారు.

కాల్పుల వార్త తెలియగానే తన అధికారిక కార్యక్రమాలను రద్దుచేసుకున్నారు నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రుట్టె. దగ్గరుండి పరిస్థితి సమీక్షిస్తున్నారు.

గాయపడినవారికి తగిన ఎమెర్జెన్సీ వైద్య సేవలు అందించాలని.. యూట్రెక్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు ఆదేశాలు వెళ్లాయి.

Latest Updates