ఆర్టీసీ సమ్మె ముగిసేదాక అద్దె అడుగను

కరీంనగర్ : ఆర్టీసీ కార్మికులకు పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. వారికి అండగా ఉంటామంటున్నారు ఫ్యామీలీలు. అంతేకాదు ఓ ఇంటి యజమాని సోషల్ మీడియాలో ఆర్టీసీ కార్మికుడిపై చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. నెల రోజులుగా ఉద్యోగంలేక రోడ్డు మీదపడ్డ ఆర్టీసీ కార్మికుల కష్టాలను అర్ధం చేసుకున్న ఇంటి యజమాని.. తన ఇంట్లో రెంటుకి ఉంటున్న ఆర్టీసీ కార్మికుడి దగ్గర సమ్మె ముగిసేంతవరకు అద్దె తీసుకోనని తెలిపి మానవత్వం చాటుకున్నాడు.

కరీంనగర్ లోని సుభాష్ నగర్ కి చెందిన ఇంటి యజమాని శీలం శంకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపడంతో..ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రభుత్వం స్పందించక పోయినా సాటి మనుషుల్లో ఇంకా మానవత్వం బతికే ఉంది అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Latest Updates