ఎల్బీన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఎల్బీన‌గ‌ర్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఎల్బీన‌గ‌ర్ వార్డు కార్యాల‌యం స‌మీపంలోని ఓ హోల్‌సేల్ కిరాణా దుకాణంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్లు దుకాణ య‌జ‌మాని తెలిపారు. విద్యుదాఘాతం వ‌ల్లే ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

 

Latest Updates