సైకో భర్త : భార్యను కొడుతూ ఫోన్లో రికార్డ్

హైదరాబాద్ : కట్టుకున్న భార్యను చావబాదాడో భర్త. రోజూ తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాడని చెప్తోంది బాధితురాలు.  వనపర్తికి చెందిన మంజులకు 15 ఏళ్ల క్రితం శ్రీనివాసులతో పెళ్లైంది. అప్పటి నుంచే తనను చిత్ర హింసలు పెట్టేవాడని ఆరోపిస్తుంది మంజుల. ఉపాధి కోసం హైద్రాబాద్ లో ఉన్న శ్రీనివాసులు ఇల్లు కొనేందుకు పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని వేధిస్తున్నాడని చెబుతోంది మంజుల. దీనిపైనే నిన్ను పుల్లుగా తాగొచ్చి భార్యను కొట్టాడు శ్రీనివాసులు.

రాడ్ తో తలపై కొట్టడంతో మంజులకు బలమైన గాయమైంది. భార్యను కొడుతూ 14 ఏళ్ల కొడుకుతో సెల్ ఫోన్లో రికార్డు చేయించాడు సైకో శ్రీనివాసులు. భర్త నుంచి తప్పించుకొని వనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ప్రస్తుతం ఆమె వనపర్తి జిల్లా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. కేసు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలో జరిగినందున అక్కడికి కేసు బదిలీ చేస్తామని అన్నారు.

Latest Updates