దిశ కేసులో కీలక ఆధారాలను కమిటీకి అందజేసిన పోలీసులు

దిశను అత్యాచారం చేసి హత్య చేసింది ఆ నలుగురు నిందితులేనని స్పష్టమైన సాక్ష్యాలను పోలీసులు NHRCకి ఇచ్చారు. ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదికను సైబరాబాద్ పోలీసులు NHRCకి సమర్పించారు. దిశ కిడ్నాప్ మొదలుకొని అత్యాచారం, హత్య, కాల్చివేత అన్నింటిపై ఆధారాలతో సహా ఒక పూర్తి నివేదికను పోలీసులు కమిటీకి అందజేశారు. ఈ కేసుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను కమిటీ ముందు పెట్టారు. సంఘటన స్థలంలో దొరికిన రక్తం మరకలు, లారీ క్యాబిన్‌లో దొరికిన రక్తం మరకల ఆధారాలతో కూడిన నివేదికను కమిటీకి ఇచ్చారు. ఘటన స్థలం నుంచి లారీ ముందుకు కదులుతున్న సీసీ ఫుటేజీని పోలీసులు నివేదికతో పాటు పొందుపరిచారు. దాంతో పాటు నిందితులు కొత్తూరు దగ్గర పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీ ఫుటేజీని కూడా సాక్ష్యంగా ఇచ్చారు. నిందితులు మరియు బాధితురాలి డీఎన్ఏ రిపోర్టులను కూడా పోలీసులు సమర్పించారు.

Latest Updates