కలకలం సృష్టించిన కాటేదాన్ చిరుత ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

హైదరాబాద్ : ఇటీవల కాటేదాన్ లో కలకలం సృష్టించిన చిరుత.. ఓ వ్యక్తిని దాడిచేసి చాకచక్యంగా తప్పించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిరుత కోసం గాలించిన ఫారెస్ట్ అధికారులకు చిరత చుక్కలు చూపించింది. అదిగో చిలుకూరులో చిరుత కనిపించిందని.. ఇదిగో రాజేంద్రనగర్ లో ఆనవాళ్లు దొరికాయని సమాచారాలు అందాయి. దీంతో ఏ క్షణాన చిరుత ప్రజలపై దాడి చేస్తుందోనని ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా చిరుత ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్ లో చిరుత ఆపరేషన్ కొనసాగుతుందని..ప్రస్తుతం రాజేంద్రనగర్ అగ్రికల్చర్  యూనివర్సిటీ, గ్రేహౌండ్స్ అడవి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు తెలిపారు అటవీశాఖ అధికారులు. సీసీటీవీ, చిరుత అడుగుల ఆధారంగా.. 900 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత సురక్షితంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం చిరుత జనావాసాల్లోని వచ్చే పరిస్థితి లేదని..ఒకవేళ బయటకు వస్తే పట్టుకునేందు బోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పలుచోట్ల ఉచ్చులు, వలలు బిగించామన్నారు.

 

Latest Updates