మనుషులపై దాడి చేస్తున్న చిరుతను కాల్చి చంపారు

డెహ్రాడూన్: కొన్ని రోజులుగా చిరుతపులి గ్రామస్తులపై దాడి చేయడంతో ఎంతో మంది చనిపోయిన సంఘటనలు ఉత్తరాఖండ్ లో జరుగుతున్నాయి. ఈ విషయం అటవీశాఖ అధికారులు తెలియడంతో.. బుధవారం గ్రామంలోకి వచ్చిన చిరుతపులిని పట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. అయినా మనుషులపైకి పరుగులు తీస్తుండటంతో.. ఇక చేసేదేమీలే ఆ చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది తుపాకీతో కాల్చి చంపారు.

ఉత్తరాఖండ్ లోని పిథోరగఢ్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ పులి ఇటీవల కొందరు గ్రామస్తులపై దాడి చేసి చంపి తింటున్నదని అటవీశాఖ అధికారి డాక్టర్ వినయ్ భార్గవ తెలిపారు. మనుషులకు ప్రమాదకారిగా మారిన చిరుతను అటవీశాఖకు చెందిన షూటర్ తుపాకీతో కాల్చి చంపినట్లు ఆయన చెప్పారు. అనంతరం పులి  మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.

 

 

 

Latest Updates