కాల్‌మనీ కలకలం.. స్టేషన్ ముందే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. కాల్‌మనీ పేరుతో అప్పు ఇచ్చిన వ్యక్తి అధిక వడ్డీతో వసూలు చేస్తున్నాడని, ఆ ఇబ్బందులు తట్టుకులేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు.

జిల్లాలోని ఉండవల్లికి చెందిన వెంకట్.. గోపాలం సాంబశివరావు అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన గోపాలం  తోలుత 3 రూపాయలు వడ్డీ అని ఆ తర్వాత కాల్ మనీ పేరుతో  12 రూపాయలు వసూలు  చేస్తున్నాడని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశాడు. అలా తన దగ్గర రూ.6 లక్షల అప్పు తీసుకొని రూ.23 లక్షల వరకూ వడ్డీ కట్టించుకున్నాడని వెంకట్ తెలిపాడు.

అదీ చాలక మిగిలిన బాకీ డబ్బులు కూడా ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తానని,  పోలీసులకు చెబితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ గోపాలం బెదిరించాడని వెంకట్ తన బాధను వెళ్లగక్కాడు.  ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదంటూ అవేదన వ్యక్తం చేశాడు. స్టేషను ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు బాధితుడు యత్నించడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

A man attempts suicide at Tadepalli police station in Guntur Dist.

Latest Updates