మంచి నీళ్లు అనుకొని శానిటైజ‌ర్ తాగాడు

అనంత‌పురం జిల్లా: పొర‌పాటున మంచి నీళ్లు అనుకొని ఓ వ్య‌క్తి శానిటైజ‌ర్ తాగాడు. ఈ సంఘ‌ట‌న శుక్ర‌వారం ఏపీలోని అనంత‌పురం జిల్లాలో జ‌రిగింది.

అనంత‌పురం జిల్లాకు చెందిన అనిల్ కుమార్ వైద్య ఆరోగ్య‌శాఖలో (డీఎమ్ హెచ్ ఓ) అధికారిగా ప‌ని చేస్తున్నాడు. అత‌డు ఇవాళ ఉద‌యం త‌న‌ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేశాక‌ మంచి నీళ్లు అనుకుని పొర‌పాటున ప‌క్క‌నే ఉన్న‌ శానిటైజ‌ర్ తాగాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు అనిల్ కుమార్ ను ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. అనిల్ ప్ర‌స్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడ‌ని.. అత‌డికి ప్రాణాపాయం ఏమీ లేద‌ని తెలిపారు డాక్ట‌ర్లు. వాట‌ర్ బాటిల్ ప‌క్క‌నే సేమ్ క‌ల‌ర్ లో శానిటైజ‌ర్ ఉంద‌ని తెలిపారు కుటుంబ స‌భ్య‌లు. ఇలాంటి విష‌యాల్లో కేర్ ఫుల్ గా ఉండాల‌ని చెప్పారు డాక్ట‌ర్.

Latest Updates