తాగిన మత్తులో సూసైడ్ చేసుకుండు

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాగిల్లాపూర్ పరిధిలోని చైతన్యనగర్​ కాలనీలో ఉంటున్న మహేందర్ సింగ్ (34) డ్రైవర్. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఆరు నెలలుగా పని మానేసి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే డబ్బులు కావాలంటూ భార్యను వేధించేవాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2.30 సమయంలో మద్యం మత్తులో ఉన్న మహేందర్​ సింగ్ ​ఇంటికి సమీపంలో నిలిపి ఉన్న సెప్టిక్​ట్యాంకర్​కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు కిందికి దించేలోపే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates