అందరికీ ఆహ్వానం : పిల్లిని పెళ్లి చేసుకోనున్న పెళ్లి కుమారుడు

చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగాకుండా వచ్చేశావే.. ఎవరినైనా చూడగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది…. ప్రపంచమే మర్చిపోయేలా చేస్తుంది.. అదే తొలిచూపు ప్రేమ. దాన్నే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాం. ఆ లవ్ అట్ ఫస్ట్ సైటే   ఓ వ్యక్తి పిల్లిని ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేసింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం.

అమెరికా కాలిఫోర్నియాకు చెందిన స్కాట్ పెర్రీ ఓ స్వచ్చంద సంస్థ నుంచి 2 సంవత్సరాల వయసున్న పిల్లిని పెంచుకునేందుకు ఇంటికి తెచ్చుకున్నాడు. జంతు ప్రేమికుడైన స్కాట్ పిల్లికి ఒలైవియా అనే నామకరణం చేశాడు.  అంతా బాగుందనునే సమయంలో  సహజీవనం చేస్తున్న ప్రియురాలు స్కాట్ కు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది.

దీంతో వరుడు రెండు నెలల పాటు బాధితుడు డిప్రెషన్ లోకి వెళ్లాడు. అదే సమయంలో ప్రియురాలు విడిచి వెళ్లినా పిల్లి ఒలైవియా మాత్రం అతనితోనే ఉంది. పలు మార్లు స్కాట్ ను చూసి బయపడ్డ పిల్లి..ఆ తరువాత కొద్దిరోజులకు బాగా అలవాటైంది. దీంతో వరుడు స్కాట్ పిల్లి ఒలైవియా ప్రేమలో పడ్డాడు. ఆ పిల్లిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా స్కాట్ మాట్లాడుతూ ఒలైవియా చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడ్డ . అందుకే మే 23న పెళ్లి కూడా చేసుకుంటున్నా. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఒలైవియాను తెచ్చిన స్వచ్ఛందం సంస్థ కోసం ఫండ్ రైజ్ చేస్తానని వరుడు స్కాట్ పెర్రీ తెలిపాడు.

Latest Updates