గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

  • గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

కల్హేర్, వెలుగు: గొంతులో చికెన్​ ముక్క ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలం ఇందిరానగర్​ తండాలో జరిగింది. ఇందిరానగర్​ తండాకు  చెందిన బాబునాయక్(39) స్థానిక దాబాకు బుధవారం రాత్రి బంధువులతో కలిసి వెళ్లాడు. చపాతిలో చికెన్ ముక్కను పెట్టుకొని తిన్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. భార్య మీరాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు శవాన్ని గురువారం పోస్టుమార్టంకు తరలించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం గొంతులో ఎముక తట్టినట్టు తేలిందని ఎస్సై అనిల్ గౌడ్ తెలిపారు.

Latest Updates