లిఫ్టు అడిగాడు.. బైక్ కొట్టేశాడు

బచ్చన్నపేట, వెలుగు : ఓ దొంగ నమ్మించి బైకి చోరీ చేసిన ఘటన బచ్చన్నపేటలో జరగగా..ఆదివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పడమటికేశ్వాపూర్ గ్రామానికి చెందిన కొన్నె బాలరాజు గతనెల 27న (గత గురువారం) జనగామ నుంచి బచ్చన్నపేటకు బయలుదేరాడు. అదే సమయంలో జనగామలోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్టు అడిగాడు. అతడిని ఎక్కించుకున్న బాలరాజు బైకును కొద్ది దూరం తోలాడు.

ఈ క్రమంలో ‘అన్న నీకేందుకు శ్రమ నేను బండి నడిపిస్తా’ అని సదరు వ్యక్తి అంటే బాలరాజు అతనికి బైక్ ఇచ్చాడు. బచ్చన్నపేట సమీపంలోకి రాగానే (అప్పటికి రాత్రి 11.30 సమయం) ‘అన్న ఒక్క నిమిషం నిలబడు ఇప్పుడే వస్తా’ అని బాలరాజును దించి పోలీస్టేష న్ సమీపంలోని బీడీ కాలనీవైపు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. బైక్ తోపాటు అందులో విలువైన పేపర్లు ఉన్నా యని పోలీసులకు బాలరాజు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎసై రఘపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Latest Updates