సిద్దిపేటలో దారుణం.. బీరు సీసాతో యువకుడిని పొడిచి..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పూసల శ్రీకాంత్ ను బీరు సీసాతో పొడిచి చంపేశారు దుండగులు.  అయితే శ్రీకాంత్ ను తానే హత్య చేశానంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. శ్రీకాంత్ ఇసుక వ్యాపారం చేస్తుంటాడని, కమీషన్ల విషయంలో గొడవ జరగడంతో  తాగిన మత్తులో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ తో పాటు మరెవరైనా హత్యలో పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాంత్ కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజుల్లేనే పెళ్లి జరగాల్సి ఉంది. ఇప్పుడు హత్యకు గురవడంతో ఆ కుటంబంలో విషాదం నెలకొంది.

Latest Updates