న్యూడ్ గా ఇల్లు క్లీన్ చేస్తున్న మహిళ..ఎందుకో తెలిస్తే మెచ్చుకోవాల్సిందే

ఇంగ్లాండ్ వాల్డర్ల్సేడ్ కెంట్ కు చెందిన రోబ్, క్లెయిర్. భార్య భర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. భర్త రోబ్ ఉద్యోగం చేస్తుండగా,భార్య క్లెయిర్ ఓ ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీనింగ్ విధులు నిర్వహిస్తుంది. అయితే భార్య భర్తలకు వచ్చే జీతం సరిపోకపోవడంతో.. కుటుంబ పోషణ కోసం క్లెయిర్ మరింత డబ్బు సంపాదించాలని ఓ ఐడియా వేసింది. న్యూడ్ గా ఇల్లును క్లీన్ చేస్తే గంటకు రూ.9వేలు, లోదుస్తులు ధరించి క్లీన్ చేస్తే గంటకు రూ.7వేలు వసూలు చేసేలా ఫాంటసీ క్లీన్ పేరుతో క్లీనింగ్ సర్వీస్ ను ప్రారంభించింది. అయితే నగ్నంగా ఇల్లు క్లీన్ చేసేందుకు కొన్ని ఆంక్షలు విధించింది. ఒంటిమీద చేతులు వేయకూడదు. దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయకూడదు. అంతేకాదు ఇల్లు క్లీన్ చేసే ముందు కష్టమర్ గురించి వాకాబు చేస్తుంది. కష్టమర్ గురించి ఫీడ్ బ్యాక్ బాగుంటే సర్వీస్ చేస్తుంది.

భార్య ఐడియాపై భర్త రోబ్ స్పందిస్తూ తాను మొదటగా నవ్వుకున్నా..క్లెయిర్ విధించే ఆంక్షలు, కష్టమర్ల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకొని పనిచేయడంతో తాను ధీమా ఉన్నట్లు చెప్పాడు.

ప్రస్తుతం ఆమె చేసే పని కొంచెం కష్టంగా ఉన్నా..కుటుంబం కోసం ఆమె పడుతున్న  తపనపై భర్త రోబ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

Latest Updates