ఎరుపెక్కిన ఆస్ట్రేలియా ఆకాశం

నిర్మలంగా ఉండే ఆకాశం ఎరుపు రంగు పులుముకుంది. బుష్​ఫైర్స్​తో ఇప్పటికే సతమతమవుతున్న కంగారూ దేశం, దుమ్ము తుఫానుతో కంగారు పడుతోంది. అదేదో రెడ్​ లెన్సు నుంచి చూస్తున్నట్టుగా మొత్తం ఎర్రగా మారిపోయింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఉన్న మిల్దురా అనే ప్రాంతంలో ఈ పరిస్థితి కనిపించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు తోడు దుమ్ము కమ్మేయడంతో ఆకాశం ఇలా ఎర్రబడిపోయింది. ప్రస్తుతం అక్కడ 40 డిగ్రీల టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. అయితే, ఈ దుమ్ము తుఫాను పెద్దగా ఏం ఆశ్చర్యపరచలేదని, పెరుగుతున్న టెంపరేచర్లతో వస్తుందని ముందే భావించామని విక్టోరియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Latest Updates