
ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో విపక్షాల సమావేశం ముగిసింది. 19 పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ తరపున రాంగోపాల్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ తరపున డెరెక్ ఓబ్రెయిన్, NCP తరపున ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు.