భద్రతపై మోడీ అత్యున్నత సమీక్ష : హాజరైన జైట్లీ

ఢిల్లీ : దేశ భద్రత అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ ఉదయం ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ 7 లో కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆ శాఖల ఉన్నతాధికారులు, రక్షణ, భద్రత, నిఘా వర్గాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సర్జరీ తర్వాత తొలిసారి సమావేశానికి అరుణ్ జైట్లీ

అమెరికాలో సర్జరీ పూర్తిచేసుకున్న తర్వాత గత వారం ఇండియాకు తిరిగొచ్చారు అరుణ్ జైట్లీ. ఆయన కోలుకున్న తర్వాత హాజరైన తొలి సమావేశం కూడా ఇదే.

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా అవంతిపొరాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని.. ఐఈడీ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఓ ఆత్మాహుతి సభ్యుడు ఢీకొట్టి సైన్యానికి భారీ నష్టం కలిగించాడు. ఈ ఆత్మాహుతిదాడిలో 42 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ సంఘటనకు బాధ్యులు, వారిపై తీసుకోవాల్సిన చర్యలపై పీఎం.. ఇతర మంత్రులు, భద్రత, రక్షణ, నిఘా అధికారులతో హైలెవల్ రివ్యూ జరిపారు.

 

Latest Updates