ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టనివ్వలేదని కత్తితో బెదిరించాడు

పదో తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశంతో పిల్లలకు దారుణాలకు తెగబడుతున్నారు. తోటి విద్యార్ధుల్ని కత్తులతో బెదిరిస్తున్నారు.

గుజరాత్ అహ్మదాబాద్ లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల సందర్భంగా కృష్ణానగర్ ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష రాసేందుకు నికోల్ కు చెందిన ఓ విద్యార్ధి అతని తండ్రితో వచ్చాడు. అయితే ఎగ్జామ్ హాల్లో బాధిత విద్యార్ధి ఎగ్జామ్ రాస్తుండగా వెనక కూర్చొని ఉన్న మరో విద్యార్ధి ఎగ్జామ్ పేపర్ చూపించాలని కోరాడు. అందుకు బాధిత విద్యార్ధి ఒప్పుకోలేదు. పలుమార్లు పేపర్ చూపించాలని విసిగిస్తుంటే ఇన్విజిలేటర్ కు కంప్లెయింట్ చేశాడు. ఎగ్జామ్ ముగిసిన వెంటనే తన తండ్రితో కలిసి కొడియార్ మాతా టెంపు సమీపంలో బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే తోటి విద్యార్ధి బాధితుణ్ని కత్తితో బెదిరించాడు. నిన్ను చంపేస్తా..? ఎగ్జామ్ హాల్లో ఎందుకు కాపీ కొట్టనివ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే పక్కనే ఉన్న తండ్రి వారించి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కత్తితో బెదిరించిన 17ఏళ్ల విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్ధి తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Latest Updates