అత్తతో గొడవ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

కొల్లాపూర్ : కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ లోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న మహేష్(30) నిహారిక(25) దంపతులకు ఇద్దరు పిల్లలు. పెంట్లవెల్లి లో భర్త మహేశ్ మొబైల్ షాప్ నడిపిస్తున్నాడు. అత్తా కోడలు మధ్య గొడవ కారణంగా మనస్తాపం చెందిన నిహారిక శనివారం ఇంట్లో ఎవరూలేని టైంలో కూతురు మని దీప్తి(3) బాబు కేథరిన్ (1)పై కిరోసిన్ పోసి ఆమె కూడా నిప్పంటించుకోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. పట్టపగలు సంఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.  మృతురాలి అత్త, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్పీ అపూర్వరావు, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ ఐ వెంకట్ రెడ్డి స్పాట్ ను పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates