ఇద్దరు చిన్నారులతో కలసి నీటి కుంటలో దూకింది

కుటుంబ కలహాలు భరించలేక..  పిల్లలతో కలసి ఆత్మహత్య

చిత్తూరు: ఎర్రవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె జీవితంలో జరగరానిది ఏం జరగిందో ఏమో తెలియరాలేదు కాని.. నిన్న రాత్రి ఓ తల్లి తన ఇద్దరు పసి పిల్లలతో కలసి ఊరి బయట నీటి కుంటలోకి పిల్లలను తోసేసి.. తానూ దూకి తనువు చాలించింది. బాలాజీ నగర్ కు చెందిన గౌతమి అనే మహిళ తన ఇద్దరు కుమారులలో కలసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం రేపింది. పెద్దగా లోతు లేని నీటి కుంటలోకి దూకి బిడ్డలను తోసి తాను ఆత్మహత్య కు పాల్పడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. గౌతమి అనే మహిళ నిన్న రాత్రి పిల్లలతో ఇంట్లో నుండి వెళ్లిపోయి ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో  అన్ని చోట్ల  వెతుకుతుండగా..  ఊరి బయట నీటి కుంటలో శవాలు తేలుతున్న విషయం గుప్పుమంది.  ధరణి ( 4 ) తోనేశ్వర్(3) ల మృతదేహాలకు సమీపంలోనే గౌతమి మృతదేహం కూడా నీటిలో తేలియాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవ పరీక్షకు పంపారు. కుటుంబ కలహాలే కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Latest Updates