భ‌ర్త‌పై కోపంతో 14 రోజుల ప‌సికందును భ‌వ‌నంపై నుంచి ప‌డేసింది

హైదరాబాద్: భర్తమీద కోపంతో ఓ తల్లి తన 14రోజుల వయసున్న పసిబిడ్డను మానవత్వం లేకుండా భ‌వ‌నంపై నుంచి కిందకు పడేసింది. సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్‌, ఫతేనగర్‌కు చెందిన లావణ్యలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో..ఇటీవల కలహాలు మొదలయ్యాయి. రెండోసారి గర్భం దాల్చిన లావణ్య ఫతేనగర్‌లోని తన తల్లిగారి ఇంటికి వచ్చింది.

భర్తతో విబేధాల నేపథ్యంలో గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీంతో తల్లిదండ్రులు బాధితురాలిని వెంటనే సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకెళ్లడంతో..బిడ్డకు, తల్లికి ప్రాణాపాయం తప్పింది. డాక్టర్లు సిజేరియన్‌ చేసి కడుపులోని బిడ్డను బయటకు తీశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయినప్పటి నుంచి లావణ్య తన అమ్మానాన్నల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం తను నివాసం ఉంటున్న బిల్డింగ్ మూడో అంతస్తు పైనుంచి తన 14రోజుల పసికందును కిందకు పడేసింది. దీంతో చిన్నారి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లావణ్యపై కేసు నమోదు చేసి..ఆమెను అరెస్ట్ చేశారు

Latest Updates