రెండేళ్ల చిన్నారిని బస్సు కిందికి విసిరేసిన తల్లి

హైదరాబాద్ : ముక్కుపచ్చలారని రెండేళ్ళ చిన్నారిపై ఓ తల్లి అమానుషంగా వ్యవహరించింది. కన్నబిడ్డ అని కూడా ఆలోచించకుండా కుమార్తెను స్పీడ్ గా వస్తున్న బస్సు కిందకు తోసేసింది. ఈ సంఘటన మంగళవారం కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలో జరిగింది. ఫుల్లుగా మద్యం తాగిన తల్లి ..ఏడుస్తున్న చిన్నారిని అంతుకుముందే దారణంగా కొట్టింది.

ఆ తర్వాత పాపను వదిలించుకోవాలనుకున్న ఆమె..బస్సు కిందికి విసిరేసిందని తెలిపారు స్థానికులు. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ఆ చిన్నారి స్వల్ప గాయాల పాలై, ప్రాణాలతో బయటపడింది. తాగుబోతు తల్లి చేసిన ఈ పనికి స్థానికులు ఏడాపెడా వాయించారు. చెట్టుకు కట్టేసి చెప్పులతో కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారిని స్థానిక హస్పిటల్ లో చేర్పించి మహిళ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

Latest Updates