60వేల ఏళ్ల క్రితమే కరోనా : గుర్తించిన సైంటిస్ట్ లు

కరోనా వైరస్ 2019 డిసెంబర్ నెలలో చైనా వుహాన్ కు చెందిన వెట్ మార్కెట్ నుంచి వ్యాపించిందని మనకు తెలిసిందే. కానీ సైంటిస్ట్ లు మాత్రం కరోనా వైరస్ 60వేల ఏళ్ల కిందట మనుషుల్లో గుర్తించినట్లు చెబుతున్నారు.

హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్ ల్లో కొంతమంది కరోనా వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు నిర్విరామంగా పనిచేస్తుంటే.. మరికొంతమంది సైంటిస్ట్ లు చైనా నుంచి పుట్టిన ఈ కరోనా వైరస్ చరిత్ర గురించి తెలుసుకునేందుకు అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణ లో భాగంగా స్వీడన్ కు చెందిన స్వంటే పాబో మరియు హ్యూగో, జర్మనీకి చెందిన  మాక్స్ ప్లాంక్  ఇనిస్టిట్యూట్ , జపాన్ కు చెందిన  ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్వీడన్ కు చెందిన  కరోలిన్ సాక్  ఇనిస్టిట్యూట్ కు చెందిన జెనెటిక్ సైంటిస్ట్ లు కరోనా కు అనుసంధానమైన డీఎన్ ఏ ఆనవాళ్లను కనిపెట్టారు. సుమారు 60వేల ఏళ్ల క్రితం నియాండర్తల్ జాతికి చెందిన మానవుల్లో కరోనా కు లింక్ ఉన్న డీఎన్ఏ ఉన్నట్లు గుర్తించారు.

ఆ డీఎన్ ఏ ఐరోపా (దాదాపు ఎనిమిది శాతం) , దక్షిణ ఆసియా (దాదాపు 30 శాతం) మంది నియాండర్తల్ ప్రజల్లో ఈ  ఉన్నాయని, దక్షిణాయాసియాలో ఎక్కువ ప్రభలడం వల్ల వారిలో కేసులు ఎక్కువున్నాయని చెప్పారు.

ఈ అధ్యయనం లో సంక్రమణ కు కారణమయ్యే జన్యువు బంగ్లాదేశ్‌లో నివసించేవారిలో సాధారణమని, బంగ్లాదేశ్‌లో 63 శాతం మంది ప్రజలు కనీసం ఈ జన్యువుకు సంబంధించిన ఒక కాపీని కలిగి ఉన్నారని వెల్లడించింది.  పైగా క్రోమోజోమ్ నియాండెర్తల్‌ మానవుల్లో మూడులో ఆరు జన్యువులున్న ట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ ప్రత్యేకమైన డీఎన్ఏ తూర్పు ఆసియన్లలో కేవలం నాలుగు శాతం ఉండగా ఆఫ్రికాలో పూర్తిగా లేదని నిర్ధారించారు.

మరొక అధ్యయనం ప్రకారం, ఆసియా మరియు యూరోపియన్ కు చెందిన నియాండర్తల్ జాతి మానవుల్లో డీఎన్ఏ 2-3 శాతం ఉందని,  వేలాది సంవత్సరాల క్రితం జరిగిన ఇంటర్ – బ్రీడింగ్ ఫలితమే అని ఈ అధ్యయనం తెలిపింది.

 

Latest Updates