చిన్న వ‌య‌సులో పెళ్లిచేసుకుంటే మ‌ద్యానికి బానిస‌లవ్వ‌డం ఖాయం: సైంటిస్ట్ లు

వివాహం త్వ‌ర‌గా చేసుకునే యువ‌కులు మ‌ద్యానికి బానిస‌ల‌వుతున్న‌ట్లు తేలింది. సాధార‌ణంగా భార‌తీయ  సాంప్ర‌దాయం ప్ర‌కారం అమ్మాయిల‌కు 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు దాటితే వివాహం చేసుకునేందుకు అర్హులు.  అయితే  వివాహ వ‌య‌సుకంటే త్వ‌ర‌గా పెళ్లి చేసుకునేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అలా అని ఒక‌వేళ వివాహం చేసుకుంటే దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త లోపించి అబ్బాయిలు ఎక్కువ మంది అతిగా మద్యం తాగేందుకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా వ‌ర్జీనియా కాన్వెల్త్ యూనివ‌ర్సిటీ సైంటిస్ట్ లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో వివాహం చేసుకున్న 937మంది వివాహం చేసుకున్న జంట‌ల‌పై సైంటిస్ట్ రెబెకా స్మిత్ ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో జ‌న్యుప‌రంగా 21సంవ‌త్స‌రాల వ‌య‌సులో వివాహం చేసుకుంటే మ‌ద్యానికి బానిస‌లవుతున్న‌ట్లు స్మిత్ తెలిపారు. ఆ వ‌య‌సులో వివాహ చేసుకోవ‌డం వ‌ల్ల జ‌న్యువులు మ‌ద్యానికి బానిస‌ల్ని చేస్తాయ‌ని అన్నారు. వివాహం త్వ‌ర‌గా చేసుకునే ప్ర‌య‌త్నం చేయోద్ద‌ని
స‌ల‌హా ఇచ్చారు.

Latest Updates