మర్యాదగా చెబితే వినరా : చైనా సైనికుణ్ణి ఉతికేసిన భారత సైనికులు

ఇది మా భూ భాగం.. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోండి అంటూ మన సైనికులు.. చైనా సైనికులకు సామరస్యంగా చెప్పారు. అయినా వినని  చైనాకు చెందిన ఓ సైనికుడు భారత సైనికుల పైకి దూసుకొచ్చాడు.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భారత సైనికులు  చైనా సైనికుడిని ఉతికేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇండియా టుడే కథనం ప్రకారం.. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో నెలకున్న సమస్యలపై ఇండియా – చైనా దేశాల మధ్య దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంచుతో కప్పబడి ఉన్న మన దేశానికి చెందిన ఓ ప్రాంత భూ భాగంలోకి చొరబడేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. వారిని మన సైనికులు  వారించే ప్రయత్నం చేయగా.. మాస్క్ లు ధరించి ఉన్న చైనా సైనికులు మన సైనికులపై దాడులు చేయడం.. బోర్డర్ లో చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

5.30 నిమిషాల నిడివి వీడియోలో చైనా సైనికులు భారత్ భూ భాగంలోకి రావడం … వారిని రావద్దని మన సైనికులు చెప్పడం … అయినా వినకుండా భారత భూభాగంలోకి వచ్చే ప్రయత్నంలో చైనా సైనికులు మన సైనికులపై దాడి చేయడం … ధీటుగా మన సైనికులు చైనా సైనికులకు సమాధానం చెప్పడం మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియకపోయినా.. చైనా సైనికులు మాస్క్ లు ధరించి ఉండడం..ఆ ఘర్షణ తాజాగా జరిగినట్లు తెలుస్తోంది.

సిక్కింలో జరిగి ఉండొచ్చు

మే నెల ప్రారంభంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, వీడియో ఆధారంగా ఇండియా – చైనా సరిహద్దు ప్రాంతాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. వీడియోలో మనకు కనిపించే ప్రాంతం సిక్కిం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మే నెలలో జరిగిన ఘర్షణలు

మే 5 నుండి గల్వాన్ మరియు తూర్పు లడఖ్ లోని అనేక ప్రాంతాలలోఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. మే 5, మే 6 తేదీలలో 250 మంది భారత్ – చైనా సైనికులు పాంగోంగ్ త్సో నది ఒడ్డున ఘర్షణ పడ్డాయి. ఆ ఘర్షణ తరువాత పరిస్థితి మరింత సున్నితంగా మారింది.  పాంగోంగ్ త్సో లో జరిగిన సంఘటన తరువాత మే 9 న ఉత్తర సిక్కింలో మరో ఘర్షణ జరిగింది. తాజా వీడియో సిక్కిం  నాకులా  సెక్టార్ సమీపంలో జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత వారం  గాల్వన్ వ్యాలీ హింసాత్మకం

గత వారం గాల్వాన్ వ్యాలీ లో భారత్ – చైనాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 40 సైనికులు మరణించారు. అయితే ఆ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు భారత – చైనా దేశాల మధ్య దౌత్య సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.

 గత 45 ఏళ్లలో అత్యంత తీవ్రమైన సరిహద్దు ఘర్షణ

గత 45 ఏళ్లలో జూన్ 15 న గాల్వన్ వ్యాలీ జరిగిన ఘర్షణ మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.  మే చివరలో లడఖ్  పాంగోంగ్ త్సో నది జరిగినట్లు అనుమానిస్తున్న వీడియోలో చైనా సైనికులు రెచ్చి పోతున్న దృశ్యాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

ఇలాంటి వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం భారత్ – చైనా దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. అయినా ప్రతీ సారి భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు  కవ్వింపుల కు దిగుతూ మన సైనికులపై దాడులు చేస్తున్న దృశ్యాలు చైనా కుట్రలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Latest Updates