అప్పుడే పుట్టిన పసికందుకు కరోనా పాజిటివ్

జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో రెండ్రోజుల పసికందుకు కరోనా సోకింది. శనివారం పుట్టిన ఆ బిడ్డ.. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే వైరస్ బారిన పడి పోరాడుతున్నారని నాగౌర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుకుమార్ కశ్యప్ సోమవారం మీడియాకు చెప్పారు. శిశువు శనివారం పుట్టిన వెంటనే ప్రత్యేక సెక్షన్ లో ఉంచి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. నాగౌర్ లో ఇప్పటివరకు 59 మందికి కరోనా వచ్చిందని, జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో చేరిన 62 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి చనిపోయాడని అధికారులు తెలిపారు.

Latest Updates