ఏపీలో కొత్తగా 10,825 కేసులు..71 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,825 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 71 మంది ప్రాణాలు  కోల్పోయారని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,87,331కు చేరింది. ప్రస్తుతం 1,00,880 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,82,104 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,347కు చేరింది.

నెల్లూరు 13, అనంతపురం 8, పశ్చిమగోదావరి జిల్లాలో 8 మంది మృతి చెందారు. చిత్తూరు 7, గుంటూరు 7, విజయనగరం 6, ప్రకాశం 5, విశాఖ 5 మంది చొప్పున మృతి చెందారు. కృష్ణా 4, కడప 3, కర్నూలు 2, శ్రీకాకుళం 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం 1,032, పశ్చిమగోదావరి జిల్లాలో 1,103 నెల్లూరు 1,046, కడప 1,039 కేసులు నమోదయ్యాయి.

Latest Updates