‘సైనిక బలిదానాన్ని గౌరవప్రదంగా చెప్పాలి’: హైకోర్టులో పిటిషన్

ఢిల్లీ : పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో సైనికుల బలిదానానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సైనికుల బలిదానం, ప్రాణత్యాగాన్ని ఎవరూ కించపరచకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులను గౌరవప్రదమైన మాటలు ఉపయోగించి సమాచారం అందించాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు సూచించాల్సిందిగా పిటిషనర్ కోరారు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేసేవారిపట్ల యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రదాడి జరిగిన కొద్దిసేపటికి.. సోషల్ మీడియాలో రకరకాలైన వ్యాఖ్యానాలు కనిపించాయి. అందులో కొన్ని వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. ఐతే… అలా వ్యాఖ్యానించి అమరులను కించపరచొద్దని.. గౌరవప్రదమైన మాటల్లో చెప్పాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Latest Updates