బికినీలో వస్తే ఫ్రీ పెట్రోల్: రెస్పాన్స్ చూసి ఓనర్ షాక్

  • ఫ్రీ పెట్రోల్ కోసం బికినీల్లో క్యూకట్టిన మగరాయుళ్లు

ఫ్రీగా వస్తుందంటే వస్తువు ఏదైనా సరే.. జనాలు భారీగా క్యూ కట్టేస్తారు. అదే పెట్రోల్ ఫ్రీ అంటే ఇక చెప్పక్కర్లేదు! ఒక్క అర్ధ రూపాయి రేటు పెరుగుతుందంటేనే ముందుగా వెళ్లి క్యూలో నిలబడి మరీ పెట్రోల్ పట్టించుకునేవాళ్లను చూస్తుంటాం మన దగ్గర. పెట్రోల్ విషయంలో దేశమేదైనా తీరు ఒక్కటేనని ప్రూవ్ చేశారు రష్యాన్ యువకులు.

రష్యాలోని సమరాలో ఉన్న ఓల్వీ పెట్రోల్ షాపు యజమాని పెట్రోల్ ఫ్రీ అని ప్రకటన ఇచ్చాడు. అయితే ఓ కండిషన్. ఫ్రీగా ఫ్యూయల్ కొట్టించుకోవాలంటే బికినీ వేసుకుని రావాలి. ఆ షాప్ ఓనర్ ఏం ఊహించి ఈ కండిషన్ పెట్టారో గానీ, అక్కడ జరిగింది మాత్రం ట్విట్టర్‌లో వైరల్‌గా మారిపోయింది. బికినీల్లో వచ్చే అందమైన అమ్మాయిల కంటే మగరాయుళ్ల సంఖ్యే ఎక్కువైంది. ఫ్రీ పెట్రోల్ కోసం వెరైటీ డ్రసింగ్‌కూ వెనుకాడలేదు రష్యన్ యువకులు. #BikiniDress హ్యాష్ ట్యాగ్‌తో బికినీల్లో వచ్చిన మగవాళ్ల ఫొటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న క్రైసిస్, ప్రభుత్వం వేస్తున్న ట్యాక్సులతో పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయని ఓ యువకుడు చెబుతున్నాడు.

రష్యాలో పెట్రోల్ రేటు

రష్యాలో ప్రస్తుతం పెట్రోల్ రేటు 46 రష్యాన్ రూబుల్స్‌గా ఉంది. మన కరెన్సీలో చూస్తే ఇది 52 రూపాయలతో సమానం.

Latest Updates