తాగి వ్యాన్ నడిపాడు.. 8 మందిని చంపేశాడు

చత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు అధికారులు, పోలీసులు చెప్పినా… కొందరు డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇలాగే.. నిన్న రాత్రి తప్ప తాగి మత్తులోనే వాహనం నడపడంతో… ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది చనిపోయిన ఈ సంఘటన చత్తీస్ గఢ్ లో జరిగింది.

బలరామ్ పూర్ జిల్లా అమేరా గ్రామంలో నిన్న రాత్రి కొంతమందిని పికప్ చేసుకునేందుకు వ్యాన్ తీసుకెళ్లాడు డ్రైవర్. ఐతే.. ఆ సమయానికి అతడు తాగి ఉన్నాడు. వ్యాన్ లో ఎక్కినవారు మొదట్లో ఆ విషయం గమనించలేదు. మొత్తం వ్యాన్ లో 25 మంది వరకు ఉన్నారు. మత్తులో డ్రైవర్ వ్యాన్ నడపటంతో… మార్గమధ్యలోనే వాహనం బోల్తా కొట్టింది. వెనకాల ఉన్న అందరూ వ్యాన్ కింద పడిపోయారు. స్పాట్ లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. స్పందించిన స్థానికులు… అధికారుల సహాయంతో… వారిని హాస్పిటల్ లో చేర్పించారు. మొత్తం 17 మందిని హాస్పిటల్ కు తీసుకెళ్తే అందులో ఒకరు చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది చనిపోయారనీ.. 16 మందికి గాయాలయ్యాయని.. వారికి ట్రీట్ మెంట్ నడుస్తోందని అడిషనల్ ఎస్పీ సుర్గుజా చెప్పారు.

Latest Updates