మూసివాగులో ఇసుక ట్రాక్టర్ గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ యువకులు(వీడియో)

సూర్యాపేట జిల్లా: పెన్ పహాడ్ మండల పరిధిలోని మూసివాగులో ఇసుక ట్రాక్టర్ గల్లంత‌య్యింది. మూసీ నదిలో.. ఇసుక రవాణా చేసేందుకు వెళ్లిన ట్రాక్టర్ అకస్మాత్తుగా మూసీ వరద పెరగడంతో కొట్టుకుపోయింది. వరద అమాంతంగా పెరుగడంతో.. ట్రాక్ట‌ర్ పై ఉన్న ఇద్దరు యువకులు ట్రాలీ నుంచి ఇసుక అన్లోడ్ చేసినప్పటికీ.. ఇంజన్ మునిగిపోయే విధంగా వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ని వదిలేసి.. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు. అందరూ చూస్తుండగానే ట్రాక్టర్ ట్రాలీతో సహా వరదనీటిలో కొట్టుకుపోయింది.

Latest Updates