నెట్ లో వెతికితే మీ వివరాలు వస్తాయ్

వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్న గూగుల్

న్యూఢిల్లీ: గూగుల్ ఒక సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ప్రతి ఒక్కరి సమాచారం తన సెర్చింజన్ లో దొరికేలా వర్చువల్ విజిటింగ్ కార్డులను ప్రవేశపెట్టనుంది . వీఐపీలు, ఎంట ర్ ప్రిన్యూ ర్ల మొదలుకొని సాధారణ జనం వరకు అంతా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఈ వర్చువల్ విజిటింగ్ కార్డ్ లను ‘పీపుల్ కార్డ్స్ ’గా పిలుస్తారు . ఉదాహరణకు శ్రీనివాస్ అనే వ్యక్తి గూగుల్ ద్వారా వర్చువల్ విజిటింగ్ కార్డ్ తయారు చేసుకుంటే.. ఆయన పేరు ను గూగుల్ లో వెతికితే వివరాలన్నీ వస్తాయి. అంటే సాధారణ విజిటింగ్ కార్డ్ లోఉండే సమాచారం ఆన్ లైన్ లో కనిపిస్తుంది. నెట్లో​ తన వివరాలు ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్ట్​ తెలియజేసింది.

ఎలా తయారు చేసుకోవాలంటే..

మొదట గూగుల్ పేజీని ఓపెన్ చేసి మన వివరాలతో సైన్ ఇన్ కావాలి. తరువాత ‘యాడ్ టు మీ టూ సెర్చ్​’ అని టైప్​ చేస్తే, వివరాలు నింపాల్సిందిగా సూచిస్తూ ఒక పేజీ వస్తుంది. ఆ పని పూర్తి చేస్తే పీపుల్ కార్డు తయారవుతుంది. దీనికి ఫొటోలను, సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్లనూ జతచేసుకోవచ్చు. వెరిఫికేషన్ కోసం ఫోన్ నంబరు, ఈ–మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. వివరాలు పబ్లిక్ కు అందుబాటులో ఉంచుకోవాలా లేదా అన్నది కూడా మన ఇష్టమే! ఒక గూగుల్ అకౌంట్ పై ఒకే కార్డును తయారు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతి ఎకౌంట్ కూ వేర్వేరు ఫోన్ నంబర్లు ఇవ్వాలి.

 

Latest Updates